స్వర్గతుల్యమైన ధ్యానావాసం .. సరిక్రొత్త శంబాల
“2003 … 2013”
.. దశ వార్షికోత్సవ సంబరాలు ..
“2000 సంవత్సరం” .. ఒక మహా ఆలోచన ప్రాణం పోసుకుంది..
“2003 సంవత్సరం” నుంచి ఆ ఆలోచన సాకారం కావడం మొదలయ్యింది.
“2013 సంవత్సరం” కల్లా ఆ ఆలోచన పూర్ణరూపంలో కళ్ళముందు సాక్షాత్కరించింది !
ఆ మహాఆలోచనే “బెంగళూరు పిరమిడ్ వ్యాలీ”
యావత్ ప్రపంచం గర్వించదగిన మైత్రేయ బుద్ధ – పిరమిడ్ ధ్యాన విద్యా విశ్వాలయ మహా శక్తిక్షేత్రం !
ప్రస్తుతం ఆధ్యాత్మిక జిజ్ఞాసులవులకూ, ఆత్మజ్ఞాన శాస్త్రజ్ఞులకూ, ఆధ్యాత్మిక వేత్తలకూ
ఆనాపానసతి ధ్యానయోగ సాధకులకూ ఒక మహా ఆనంద ధామంలా విలసిల్లుతోంది!
చుట్టూ కొండలతో, ప్రకృతి ఒడిలో, ప్రశాంత వాతావరణం నడుమ .. 2004 నుంచి
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ కు చెందిన వార్షిక
“బుద్ధపౌర్ణమి” మహోత్సవాలతో పాటు “ప్రపంచ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమ్మేళనాల” కు
వేదిక అయిన ఈ శక్తిక్షేత్రం నేడు దేశ విదేశాల ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల ఆదిభౌతిక ప్రయోగాలకు పరిశోధనశాలగా రూపుదిద్దుకుంది.
ఇది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ఆధ్యాత్మిక ప్రపంచం సాధించిన గొప్ప విజయం!
ఈ మహా విజయ పరిసాధనకోసం అహిర్నిశలూ కృషి చేసిన భారతదేశ వ్యాప్త పిరమిడ్ మాస్టర్లందరికీ అభినందనలు!
ముచ్చటగా ఈ “శంబాల పిరమిడ్ వ్యాలీ” ప్రాయం ఇప్పుడు పది వసంతాలు!