హంస ధ్యానం
‘హంస ధ్యానం’ అంటే ‘శ్వాస ధ్యాస’ … అంటే శ్వాస మీద ధ్యాస హంస ధ్యానం ద్వారానే ‘పరమహంస’ అయ్యేది. ఎంతో మంది సృష్టిలో పరమహంసలు ఇంతవరకు అయ్యారు. ఇప్పుడు ఎంతోమంది అవుతున్నారు. మిగతా అందరూ భవిష్యత్తులో కాబోతున్నారు.
ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి బాలుడు పరమహంస కావలసిందే. ఎలా అవుతాం పరమహంస? ‘హంస ధ్యాస’ ద్వారానే పరమహంస అవుతాం. పరమహంస అయిన తర్వాతనే జీవితంలో హాయి వచ్చేది. అప్పుడే జీవితంలో ఆనందం వచ్చేది.
“హంస అనేది పాలను, నీటిని వేరు చేస్తుంది” అని ప్రతీతి. పాలు సత్యం, నిత్యం … నీరు అంటే అసత్యం, అనిత్యం … హంస ధ్యానం ద్వారానే నిత్యమూ-అనిత్యమూ వేరు వేరు. దేహి-దేహమూ వేరువేరుగా తెలుసుకుంటాం. నిత్యాన్నీ, అనిత్యాన్నీ పూర్తిగా వేరు చేసేసినవాడు ‘పరమహంస’ అని అర్థం.
సరస్వతీదేవి వాహనం హంస. ‘సరస్వతి’ అంటే చదువుల తల్లి. కళల నిలయం. సకల కళలనూ సొంతం చేసుకుంటాం. ‘హంస ధ్యానం’ ద్వారానే మనం చదువుల్లో రాణిస్తాం. సకల కళలనూ సొంతం చేసుకుంటాం. ‘హంసమూర్తి’ అయితేనే మనం ధ్యానమూర్తి అయ్యేది. ‘ధ్యానమూర్తి’ అయితేనే మనం మరి ప్రజ్ఞామూర్తి అయ్యేది. అందరమూ హంసాత్ములం అయ్యెదముగాక.
హంసో శరణం గచ్ఛామి.
హంస యేవ శరణం వయం.