హ్యాపీ న్యూ ఇయర్

 

జీవితం ఎప్పటికప్పుడు క్రొత్తే ; జీవితం ఎప్పుడూ వినూతనమైనదే.

అయితే, దృష్టిలోపం వల్ల ఆత్మజ్ఞానం లేనివారు ఎప్పటికప్పుడూ పాత జీవితాన్నే అనుభవిస్తున్నాం అని అనుకుంటూంటారు.

ఒక్క క్షణం క్రింద వున్న జీవితం ఇప్పుడు వుండడం అసంభవం.

జీవితం పారే నది లాంటిది.

నీరు ఎప్పుడూ మారుతూనే వుంటుంది.

జీవిస్తూ ప్రతిక్షణంలోని నూతనత్వాన్ని ఆస్వాదించడమే ఆత్మజ్ఞానం యొక్క విస్పోటనం.

ధ్యానం, ఆత్మజ్ఞానం అంటే శ్వాసను గమనిస్తూ, కళ్ళు మూసుకుని కూర్చోవడమే కాదు.

కళ్ళు తెరచి వున్నప్పుడు గమనించబడే ప్రతి క్షణంలోని నూతనత్వాన్ని ఆస్వాదించడం కూడా జ్ఞానమే. వాస్తవానికి అదే వికసిత ఆత్మజ్ఞానం.

ఇంతవరకు న్యూ గురించి చెప్పుకున్నాం ; ఇక హ్యాపి గురించి చెప్పుకుందాం.

నిజానికి జీవితం ఎప్పుడూ హ్యాపీ యే.

ఆత్మజ్ఞానం లేకే మానవుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ; నిజానికి దుఃఖం అన్నది ప్రకృతిలో ఎక్కడా లేదు.

చావే లేనప్పుడు దుఃఖం ఎక్కడిది ? వాస్తవానికి ఎటు చూసినా హ్యాపీ, హ్యాపీ హ్యాపీ యే …

ఉన్నదంతా హ్యాపియే ; వున్నదంతా హ్యాపీగానే వున్నప్పుడు ఇక క్రొత్తగా వస్తున్నది మరి ఇంకెంత హ్యాపీ .. కనుక, హ్యాపీ న్యూ ఇయర్.