భూలోకమే ఒక గొప్ప పాఠశాల

 

“ఈ భూలోక ప్రపంచమే ఒక గొప్ప పాఠశాల! మనం అందరం కూడా ఆ పాఠశాలలో శిక్షణ పొందడానికి వచ్చిన విద్యార్థులం! పాఠశాలలో ప్రాథమిక, మాధ్యమిక మరి ఉన్నత స్థాయిలు వున్నట్లే మనం కూడా ‘ప్రపంచం’ అనే పాఠశాలలో మూడు స్థాయిల్లో విద్య నేర్చుకుంటాం! “జీవవధ చేయడం .. ప్రాణికోటిని వికృత చేష్టలతో శారీరకంగా హింసించడం .. మరి ఇతరుల వ్యక్తిగత అనుభవాలలో జోక్యం చేసుకోవడం వంటివి చేయకుండా జీవితాన్ని అహింసాయుతంగా గడపడం మనం ప్రాథమిక స్థాయి పాఠశాలలలో నేర్చుకుంటాం! “ధ్యానం చేయడం .. అన్ని విషయాల్లో మధ్యేమార్గంగా ఉండడం .. స్వాధ్యాయం చేసుకోవడం మాధ్యమిక స్థాయి పాఠశాలలలో నేర్చుకుంటాం!

“ధ్యానం ద్వారా మనల్ని మనం తీర్చిదిద్దుకుని బుద్ధత్వ స్థితికి చేరుకుంటూ మన దగ్గరికి వచ్చిన వారికి జ్ఞానాన్ని అందిస్తూ వారు కూడా వారి బుద్ధత్వస్థితికి చేరుకునేలా సహాయం చేయడం బోధిసత్వ స్థితి. “మనం ఒక్కదగ్గరే కూర్చోకుండా అన్ని ప్రాంతాలకు తిరుగుతూ మన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మరింతమందికి విస్తృతంగా పంచిపెట్టడం బుద్ధత్వస్థితి! “బోధిసత్వస్థితికి మరి బుద్ధత్వస్థితులు రెండూ తప్పక పొందడమే ఉన్నత పాఠశాలలో నేర్చుకునే అంశాలు. పిరమిడ్ మాస్టర్లందరూ బుద్ధత్వస్థితిలో వున్న మాస్టర్స్” అంటూ తెలియజేశారు!