3+1=నాలుగు=పిరమిడ్ కోతులు
మన పెద్దలు మనకు “మూడు కోతులను” ఇచ్చారు
“కళ్ళు మూసుకున్న కోతి” .. “చెవులు మూసుకున్న కోతి” .. “నోరు మూసుకున్న కోతి”
సాధారణంగా అందరూ
“చెడు చూడరాదు” .. “చెడు వినరాదు” .. “చెడు మాట్లాడరాదు”
అని పై సూచనలను అర్థం చేసుకుంటారు
అలాగని మన పెద్దలు మనకు చిన్నప్పుడు చెప్పారు
అయితే, నిజానికి సమగ్ర వ్యాఖ్యానం కాజాలదు
‘చెడు’ మాత్రమే కాదు .. ‘మనకు అనవసరమైనవి’ కూడా మనం చూడకూడదు, వినకూడదు
మరి ‘ఇతరులకు పనికి రానివీ, ఇతరులకు అనవసరమైనవీ’ అస్సలు మాట్లాడకూడదు!