ఇరవై ఏళ్ళ అఖండ వ్రత దీక్ష యొక్క మహిమ

 

వ్రతం అన్నది ఒక అకుంఠిత దీక్ష

“మౌనవ్రతం” .. “ఉపవాసవ్రతం” ..

ఈ విధంగా వ్రతాలెన్నో ..

పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా అక్షరాలా రెండు పదుల వత్సరాల సుదీర్ఘ

“ఆనాపానసతి ధ్యానప్రచార వ్రత దీక్ష” లో

“శాకాహార ప్రచార వ్రత దీక్ష” లో

“పిరమిడ్‌శక్తి ప్రచార వ్రత దీక్ష” లో

1992 సంవత్సరం ప్రారంభం నుంచి .. 2012 సంవత్సరం చివరాఖరి వరకు

అనన్యసామాన్య విధంగా రాత్రనక – పగలనక, ఊరనక – వాడనక

శ్రమించారు .. పరిశ్రమించారు

ఇక ముందు కూడా మన మాస్టర్లు అదేవిధంగా పరశ్రమిస్తూనే వుంటారు

మరి మన ధ్యానప్రచార కార్యక్రమాలు, ధ్యానఅభ్యాస జీవితాలు ..

తుది శ్వాస వరకు అదేవిధంగా విరాజిల్లుతూనే వుంటాయి

“ఇరవై ఏళ్ళ అఖండ వ్రతదీక్ష” యొక్క “మహిమ” వల్ల

యవత్ ప్రపంచ ముముక్షు జన మానవాళికి మన సత్య సత్యసందేశాలు చేరిపోయాయి

ఇక ఎవ్వరూ ” ‘ సరియైన ధ్యానవిధానం ’ గురించి మాకు చెప్పేవాళ్ళు లేరు ..

అందుకోసం మేం ధ్యానం చెయ్యలేకపోయాం ” అని అనలేరు!

ఇక ఎవ్వరూ “శాకాహార విశిష్టత గురించి మాకు చెప్పేవాళ్ళు లేరు ..

అందుకోసం మేం శాకాహారులం కాలేకపోయాం” అని అనలేరు !

ఇక ఎవ్వరూ “ఆత్మస్వేచ్ఛ గురించి, ఆత్మశక్తి గురించి మాకు చెప్పేవాళ్ళు లేరు ..

ఇక ఎవ్వరూ “ఆత్మస్వేచ్ఛతో, ఆత్మశక్తితో కూడి ఉండలేకపోతున్నాం” అని అనలేరు !

ఇక ఎవ్వరూ “ఆత్మలోకాల గురించి మాకు చెప్పేవాళ్ళు లేరు ..

అందుకోసం మేం ఆత్మలోక సమాచారాలను అందుకోలేకపోతున్నాం” అని అనలేరు !

1992 నుంచి 2012 వరకు ఇరవై సంవత్సరాల పాటు

అఖండంగా .. ఏకధాటిగా .. కూలంకషంగా .. అంతా చెప్పబడింది

ఇక ఎవరి ఇష్టం వాళ్ళది !

అంతేకాక,

ఆంధ్రరాష్ట్రంలోని గ్రామగ్రామాలలో వేలాదిగా పిరమిడ్‌లు ..

పిరమిడ్ ఇంజనీర్ల విశేష కృషి వల్ల .. నిర్మించబడ్డాయి

తద్వారా అసంఖ్యాకంగా పిరమిడ్ ధ్యానకేంద్రాలు వెలిసాయి

అంతేకాక,

భారతదేశంలోని

అనేక ఇతర రాష్ట్రాలలోనూ వందలాదిగా పిరమిడ్ ధ్యానకేంద్రాలు వెలిసాయి ..

మరి బెంగళూరు మహానగర సమీపాన వున్న “మైత్రేయబుద్ధ ధ్యానవిద్యావిశ్వాలయం”

ప్రపంచానికే ఒక అద్భుత వరంగా .. సరిక్రొత్త శంబాల గా .. సాక్షాత్కరించింది!

అంతేకాక,

వియత్నాం దేశంలో ఒక పిరమిడ్ ధ్యానకేంద్రం ..,

అమెరికా దేశంలో మరొక పిరమిడ్ ధ్యానకేంద్రం వచ్చాయి ..

ప్రస్తుతం, యావత్ భారతదేశంలో,

వేలాదిగా పిరమిడ్ ధ్యానయోగులు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు

లక్షలాదిగా మాంసాహారులు .. శాకాహారులుగా మారిపోయారు

ప్రతి చోటా బ్రహ్మర్షులు, బ్రహ్మజ్ఞానులు, బుద్ధుళ్ళు తయారయ్యారు

ధ్యాన – జ్ఞాన పూర్ణ పిరమిడ్ మాస్టర్లు అందరూ బ్రహ్మానందంలో ఓలలాడుతున్నారు

ఇక అంతా సంబరాలే ! ఇక ప్రతిదినమూ పండగే !

క్రొత్త ఆనందయుగం ఆవిర్భవించింది

సరిక్రొత్త ధ్యానారోగ్యయుగం ఏతెంచింది

నూతన ధ్యానసౌభాగ్యయుగం ఆవిష్కృతమైంది

పిరమిడ్ మాస్టర్ల కృషిమయ జీవితాలు ధన్యమయ్యాయి

పిరమిడ్ మాస్టర్లందరికీ “శ్రీ వి-జ-య” నామ సంవత్సరాది సందర్భంగా అభినందనలు !