భగవద్గీత 2-55

ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |

ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే || ”

 

పదచ్ఛేదం

ప్రజహాతియదాకామాన్సర్వాన్పార్థమనోగతాన్ఆత్మనిఏవఆత్మనాతుష్టఃస్థితప్రజ్ఞఃతదాఉచ్యతే

ప్రతిపదార్థం

పార్థ = అర్జునా ; యదా = ఎప్పుడూ ; మనోగతాన్ = మనస్సులో ఉండే ; సర్వాన్ = సమస్తాలైన ; కామాన్ = కోరికలను ; ప్రజహాతి = వదిలి వేస్తాడో ; ఆత్మనా = ఆత్మలో ; ఆత్మని ఏవ = ఆత్మలోనే ; తుష్టః = సంతుష్టుడై వుంటాడో ; తదా = అప్పుడే ; స్థితప్రజ్ఞః = స్థితప్రజ్ఞుడు ; ఉచ్యతే = చెప్పబడుతున్నాడు

తాత్పర్యం

అర్జునా ! ఎప్పుడు ఒకానొక పురుషుడు, మనస్సులో వుండే సమస్తాలైన కోరికలను వదిలివేస్తాడో, ఆత్మలోనే ఆత్మసంతుష్టుడై వుంటాడో అప్పుడే స్థితప్రజ్ఞుడని చెప్పబడుతున్నాడు. ” 

వివరణ

కోరికలలో తిష్ఠ వేసినవాడు సగటు మానవుడు.

అవసరాలు శరీరానికి సంబంధించినవి.

కోరికలు మనస్సుకు సంబంధించినవి.

అవసరాలు వేరే, కోరికలు వేరే.

అవసరాలు ఎప్పుడూ సమంజసమే.

కోరికలు ఎప్పుడూ అసమంజసమే.

ప్రాపంచికమైన అత్యాశలే కోరికలు.

అవి మనస్సు యొక్క మారుమూలల్లో దాక్కుని ఉంటాయి.

అన్ని రకాల కోరికలనూ త్యజించి జీవించాలి.

ఒక్కటీ కూడా మిగలకుండా నిశ్శేషంగా త్యజించాలి.

సమస్త దృశ్యజగత్తుకు అతీతమైన ఆత్మయొక్క యథార్థ స్వరూపాన్ని దర్శించి,

ఆత్మలోనే స్థితమైనప్పుడుఅంతా తానేతానే అంతాఅప్పుడు

ప్రత్యేక కోరికలకు తావెక్కడ?

ధ్యాన సాధన ద్వారా

యోగసాధన ద్వారా ఆత్మానుభూతిలోని ఆనందాన్ని

ఆత్మానందాన్ని అనుభవిస్తూ

తన ఆత్మలోనే తాను సంతృప్తిని పొందుతూ

ఆత్మలోనే తిష్ట వేసినవాడుస్థితప్రజ్ఞుడు ”.