” పిరమిడ్ మాస్టర్లకు కొన్ని వ్యక్తిగత సూచనలు “
పిరమిడ్ మాస్టర్లందరూ మేలిమి ముత్యాలు !
PSSM లో ఉన్న 18 ఆదర్శ సూత్రాలు పిరమిడ్ మాస్టర్లందరికీ తెలుసు !
అయినా కొన్ని “వ్యక్తిగత తప్పనిసరి సూత్రాల ” ను గరించి తెలుసుకుందాం:
1.PSSM కార్యకలాపాలు అన్నింటికీ పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎప్పుడూ ” YES” .. “YES“.. “YES” అంటూనే ఉండాలి. కార్యక్రమాలలో పాల్గొన్నా .. పాల్గొనకపోయినా .. “No” అని మాత్రం నోటినుంచి ఎప్పుడూ రాకూడదు. చేతనైతే సహాయం చేయ్యాలి .. లేకపోతే మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. నకారాత్మకంగా మాత్రం మాట్లాడకూడదు.
2.ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు చిందులు వేయాలి.
3.అందరి పనులను తామే చేస్తూ … దాని “క్రెడిట్” ను మాత్రం అందరికీ పంచాలి!
4.సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆత్మ పరిణితిలో వ్యవహరిస్తూ జూనియర్ పిరమిడ్ మాస్టర్లును సరిసమానంగా గౌరవించడం నేర్చుకోవాలి.
5.” కలిసి ఉంటే కలదు సుఖం ” అని సదా గుర్తుంచుకోవాలి.
6.ఎప్పుడూ పరిసరాలను శుచిగా ఉంచాలి .
7.శౌచం, సంతోషం, స్వాధ్యాయాలను తప్పనిసరి దైనందిక నియమాలుగా పాటించాలి.
8.భౌతిక అవసరాలైన నిద్ర, భోజనాదులను క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఉండాలి.
9.ఏ చిన్న పని చేయడానికి అయినా సదా సంసిద్ధులుగా ఉండాలి; రాత్రనక .. పగలనక 24/7 కష్టపడడం నేర్చుకోవాలి.
10.జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు; చేయవలసిన వాటి కోసం మాత్రం ఎప్పుడూ ప్రణాళికలు ఉండాలి.
11.ధ్యానం – జ్ఞానం అన్నవి ఎంత ముఖ్యమో … ఆటలూ … పాటలూ అంతే ముఖ్యం.
12.తమకు హాని చేసేవాళ్ల గురించి .. ఎప్పుడూ మంచిగానే ఆలోచించడం నేర్చుకోవాలి.
13.తమపట్ల తాము విశేష అభినందనలతో … విశేష Self-appreciation తో కూడి ఉండాలి.