భగవద్గీత 8-12
“సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్యచ | |
పదచ్ఛేదం
సర్వద్వారాణి – సంయమ్య – మనః – హృది – నిరుధ్య – చ – మూర్ధ్ని – ఆధాయ – ఆత్మనః – ప్రాణం – ఆస్థితః – యోగధారణాం
ప్రతిపదార్థం
సర్వద్వారాణి = సర్వేంద్రియాలను ; సంయమ్య = నిగ్రహించి ; చ = అలాగే ; మనః = మనస్సును ; హృది = హృదయంలో ; నిరుధ్య = స్థిరం చేసి ; ప్రాణం = ప్రాణాన్ని ; మూర్ధ్ని = సహస్రారంలో ; ఆధాయ = ఉంచి ; ఆత్మనః = ఆత్మ యొక్క ; యోగధారణాం = ధ్యానంలో ; ఆస్థితః = నిమగ్నుడై ; యః = ఎవరు
తాత్పర్యం
“ సర్వ ఇంద్రియ ద్వారాలనూ మూసి, మనస్సును హృదయంలో నిలిపి, ప్రాణాలను సహస్రారంలో స్థిరపరచి, ఏకాగ్రచిత్తంతో ఆత్మధ్యానం చేస్తూ ఉన్నవాడు…”
వివరణ
ఇంద్రియాలు మనస్సులో బాహ్యవిషయ లాలసత అనే విక్షేపాలను కలిగించి
మనస్సునుకూడాతమవెంటబయటకుతీసుకుపోయేసామర్థ్యంకలవి
ఆ మనస్సును ఇంద్రియ అనుభవాల నుండి మరల్చి ఆత్మవైపుకి తిప్పాలి
గది కిటికీలు తెరచి ఉంచితే “ దీపం ” ఆరిపోతుంది …
ఇంద్రియాలను మూయకపోతే మనస్సు స్వాధీనంలోకి రాదు
ఇంద్రియాలను మూసేస్తే వాటికి నాయకత్వం వహించే మనస్సు కూడా …
మనస్సు పుట్టే హృదయంలో లయమైపోతుంది.
“ ప్రాణం ” అంటే “ శ్వాస ”.
శ్వాసను తదేక దీక్షతో … ఏకాగ్ర చిత్తంతో గమనిస్తూ ఉంటే,
శ్వాస తనంతట తానుగా భ్రూమధ్యంలో స్థితమైపోతుంది.
ఇంద్రియాలు మనస్సులో లయమైపోయి మనస్సు అంతర్ముఖమై,
చిత్తవృత్తుల నిరోధం జరుగుతుంది.
మనస్సు … మనోలయం జరిగి … ‘ మనస్సు ’ లేని స్థితికి …
ఆలోచనా రహిత స్థితికి చేరుకుంటుంది.
ఈ రకమైన యోగస్థితిలో …
విశ్వంలోని అనంతమైన ప్రాణశక్తి … విశ్వశక్తి …
సహస్రార ప్రాంతంలోని బ్రహ్మరంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ఇలా మనస్సును అంతర్ముఖం చేసి … ఆత్మలో నిలిపి …
ధ్యానంలో వుండడమే … “ యోగధారణ ” అవుతుంది.