భగవద్గీత 6-25

శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా |           

ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ||

పదచ్ఛేదం

శనైఃశనైఃఉపరమేత్బుద్ధ్యాధృతిగృహీతయాఆత్మసంస్థంమనఃకృత్వాకించిత్అపిచింతయేత్

ప్రతిపదార్థం

శనైః, శనైః = క్రమక్రమంగా ; ఉపరమేత్ = విశ్రాంతి పొందాలి ; ధృతిగృహీతయా = ధైర్యంతో కూడిన ; బుద్ధ్యా = బుద్ధి ద్వారా ; మనః = మనస్సును ; ఆత్మసంస్థం, కృత్వా = ఆత్మలో స్థిరమయ్యే విధంగా చేసి ; కించిత్, అపి = వేరే దేనినీ కూడా ; , చింతయేత్ = ఆలోచించకూడదు

తాత్పర్యం

మనస్సుతో యింద్రియ నిగ్రహంచేసి, ధీరుడై, ప్రాపంచిక విషయాల నుంచి బుద్ధిని దూరంచేసి మనస్సును ఆత్మలోనే సమ్యమం చేసి ఇతర ఆలోచనలు, చింతలూ లేకుండా వుండాలి. ”

వివరణ

బాహ్య చింతనకు అలవాటు పడిన మనస్సును బుద్ధితో నిగ్రహించి,

ప్రాపంచిక విషయాల నుంచి దూరంచేసి,

అంతర్ముఖమయ్యేటట్టు, ఆత్మలో స్థితమయ్యేటట్టు చెయ్యాలి.

మళ్ళీ మళ్ళీ ఆ మనస్సులో ఇతర విషయ ఆలోచనలు ఏవి వచ్చినా,

వెంటనే వాటిని వదిలిపెట్టెయ్యాలి.

ఇలా నెమ్మది నెమ్మదిగా, ధైర్యంగా ప్రయత్నం కొనసాగించాలి.

ధ్యాన సాధనలో సహనమే మహాసాహసం.

ధ్యాన సాధనలో సహనమే మహాధైర్యం.