భగవద్గీత 5-18

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |     

శునిచైవశ్వపాకేచపండితాఃసమదర్శినః||

పదచ్ఛేదం

విద్యావినయసంపన్నేబ్రాహ్మణేగవిహస్తినిశునిఏవశ్వపాకేపండితాఃసమదర్శినః

ప్రతిపదార్థం

పండితాః = పండితులు ; విద్యావినయసంపన్నే = విద్యతో , వినయంతో ఉన్న ; బ్రాహ్మణే చ = బ్రాహ్మణునియందు ; గవి = గోవును ; హస్తిని = ఏనుగుయందు ; శుని = కుక్కనందు ; శ్వపాకే చ = ఛండాలునియందు ; సమదర్శినః ఏవ = సమదృష్టినే కలిగి ఉంటారు

తాత్పర్యం

విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు, ఛండాలుడు, ఆవు, కుక్క, ఏనుగు మొదలైన జంతువులుఅన్నింటి పట్ల కూడా సమదృష్టి కలవాడే పండితుడు.”

వివరణ

పండితుడుఅంటే, ఆత్మజ్ఞాన విశారదుడు

అందరినీ ఆత్మస్వరూపంగాసమానంగా చూసేవాడు.

పండితుడుఅంటేవ్యాకరణ పండితుడు ”, “ సంస్కృత పండితుడు

కాడు !

విద్యతో, వినయంతో కూడుకున్న బ్రాహ్మణుడయినఅంటే

నిర్గుణ ప్రకాశకుడయినా

శుద్ధ సాత్విక గుణ సంపన్నమైనఆవులాంటి వారు అయినా

సాత్విక గుణ ప్రధానమైనఏనుగులాంటి వారయినా

రజోగుణం కలిగినకుక్కలాంటి వారు అయినా

కుక్క మాంసం వండుకుని తినే

అత్యంత తమోగుణం కలిగిన ఛండాలుడు అయినా

ఏ గుణం కలిగిన వారైనాపండితుడికిసమానమే.

అదే విధంగా మనిషి అయినా జంతువయినా

అందరినీ సమదృష్టితో చూడగలిగేవాడుపండితుడు ” …

ఆ విధంగా సకలప్రాణకోటినీ సమంగా చూడలేనివాడుపామరుడు ”.