భగవద్గీత 2-19

 

ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ |

ఉభౌ తౌ విజానీతో నాయం హంతి హన్యతే || ”

 

పదచ్ఛేదం

యఃఏనంవేత్తిహంతారంయఃఏనంమన్యతేహతంఉభౌతౌవిజానీతఃఅయంహంతిహన్యతే

ప్రతిపదార్థం

యః = ఎవడైతే ; ఏనం = దీనిని ( ఆత్మను) ; హంతారం = చంపేదానిగా ; వేత్తి=భావిస్తాడో ; = అలాగే ;యః = ఎవడయితే ; ఏనం = దీనిని(ఆత్మను) ; హతం = చంపబడినదానిగా ; మన్యతే = భావిస్తాడో ; తౌ, ఉభౌ = , ఉభయులూ ; , విజానీతః = తెలిసినవారు(జ్ఞానులు) కారు ; అయం = ఇది ( ఆత్మ) ; , హంతి = (ఎవ్వరినీ) చంపదు ; , హన్యతే = (ఎవ్వరి చేత) చంపబడదు

తాత్పర్యం

ఆత్మను చంపేదానిగా గానీ, చంపబడిన దానిగా గానీ భావించేవారు కేవలం అజ్ఞానులు మాత్రమేఎందువల్లనంటే ఆత్మ చంపదు, చంపబడదు. ”

వివరణ

మనం శరీరం కాదుఆత్మ ;

శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు

ఆత్మ అన్నదే కేవలం శరీరం నుంచి నిష్క్రమిస్తుంది ;

ప్రతి పుట్టుకతో ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది

ప్రతి మరణంతో ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది ;

మనం ఎన్నెన్నో జన్మలను తీసుకుని ఉన్నాం

మరి తీసుకున్న జన్మలన్నిటి నుంచీ నిష్క్రమించి ఉన్నాం.

ఆత్మ అన్నది చంపదుచంపబడదు. ”

ఇదే తెలుసుకోవలసిన జ్ఞానంఆత్మజ్ఞానం.

దీనిని స్వానుభవంలో గ్రహించిన వాడు జ్ఞాని

తెలుసుకోలేని వాడు అజ్ఞాని.

అజ్ఞాని మాత్రమే ఆత్మను చంపేదానిగా గాని

చంపబడేదానిగా గాని భావిస్తాడు.