భగవద్గీత 6-17

యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు |

యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ||

 

పదచ్ఛేదం

యుక్తాహారవిహారస్యయుక్తచేష్టస్యకర్మసుయుక్తస్వప్నావబోధస్యయోగఃభవతిదుఃఖహా

ప్రతిపదార్థం

యుక్తాహారవిహారస్య = యుక్తమైన ఆహార విహారాలు గలవాడు ;

కర్మసు = కర్మాచరణలో ; యుక్తచేష్టస్య = యుక్తంగాప్రవర్తించేవాడు ; యుక్తస్వప్నావబోధస్య = నిద్ర, మెలకువలలో యుక్తంగా ఉండేవాడు ; దుఃఖహా = దుఃఖాన్ని నాశనం చేసే ; యోగః = ధ్యానయోగం ; భవతి = సిద్ధిస్తుంది

తాత్పర్యం

యుక్తమైన ఆహారం, నడత, కర్మాచరణ, యుక్తమైన నిద్ర, మెలకువ కలిగి వున్నవాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యానయోగం సిద్ధిస్తుంది. ”

వివరణ

ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారం సాత్త్వికాహారం.

ఇది ఆయువునూ, బలాన్నీ, ఆరోగ్యాన్నీ, సుఖాన్నీ వృద్ధిచేస్తుంది.

ఎక్కువుగా తిని భుక్తాయాసంతోనూ, తక్కువుగా తిని ఆకలితోనూ బాధపడక

అవసరానికి అనుగుణంగాయుక్తమైన ఆహారం ” … మితంగా తీసుకోవాలి.

యుక్తాహారంఅంటే శాకాహారం

 యుక్తాహారంఅంటే సాత్విక

ఆహారం

శ్రేష్ఠమైన యుక్తాహారంఅంటే

ఫలాహారం ”.

ఆకలి ఉన్నప్పుడే తినాలి

ఆకలి ఎంతవుందో అంతకన్నా రెండు ముద్దలు తక్కువే తినాలి

వారానికి ఒకరోజు నిరాహారిగా వుండాలిఅంటే ఉపవాసం వుండాలి

లంఖణం పరమౌషధంకదా !

ఇకపోతేస్వప్నంఅంటేనిద్ర ” … మనిషి శారీరక మానసిక అవసరాలకు అనుగుణంగాసరి అయిన నిద్రనిద్రించాలి.

యోగంతో కూడుకున్న నిద్ర ” … “ యోగనిద్ర ” … “ సరి అయిన నిద్ర ”.

మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే చేష్టలు ధర్మంగా

ధర్మయుక్తంగా ఉండాలి.

యుక్త విహారంచెయ్యాలి.

ప్రక్కవాడిని కష్టపెట్టి మనం సుఖం పొందడం కాదు

ప్రక్కవాడి సుఖం కూడా మన సుఖంతో కలిసి మిళితంగా ఉంటే

అదియుక్త విహారంఅవుతుంది.

కేవలం మన సుఖం కోసమే మన చేష్ట అయితే అది యుక్తమైనది కాజాలదు.

మనం తిరిగే ప్రదేశాలు మానసిక ప్రశాంతతను కలిగించేవిగానూ

ఇంకా తోడ్పడేవిగానూ ఉండాలే కానీ

ఉద్రేకాలను ప్రకోపింప చేసేవిగా ఉండకూడదు.

అదే విధంగామనం సరియైన జ్ఞానాన్నిఅంతే అవబోధనుసంపాదించాలి.

తన్ను తాను తెలుసుకునే జ్ఞానమే సరియైన జ్ఞానం, సరియైన అవబోధ.

ఈ విధమైనయుక్త యోగంద్వారా మాత్రమే దుఃఖం హరిస్తుంది.

దుఃఖం హరించడానికే యోగసాధన చేయాలియోగసిద్ధి పొందాలి.