భగవద్గీత 18-78

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |

తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ||

పదచ్ఛేదం

యత్రయోగేశ్వరఃకృష్ణఃయత్రపార్థఃధనుర్ధరఃతత్రశ్రీఃవిజయోభూతిఃధ్రువానీతిఃమతిఃమమ

ప్రతిపదార్థం

యత్ర = ఎక్కడ ; యోగేశ్వరః = యోగేశ్వరుడైన ; కృష్ణః = శ్రీకృష్ణుడు ; యత్ర = ఎక్కడ ; ధనుర్ధరః = ధనస్సును చేబట్టిన ; పార్థః = అర్జునుడు ; తత్ర = అక్కడ ; శ్రీః = లక్ష్మి (సంపద) ; విజయః = విజయం ; భూతిః = ఐశ్వర్యం ; ధ్రువా = దృఢమైన ; నీతిః = నీతి ; (సన్తి ఇతి = కలవు అని ) ; మమ = నా యొక్క ; మతిః = అభిప్రాయం

తాత్పర్యం

ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యం, విజయం, దృఢమైన నీతి ఉంటాయని నా ఆభిప్రాయం. ”

వివరణ

శ్రీకృష్ణుడు ఒకానొక జగద్గురువు ; ఒకానొక యోగేశ్వరుడు

శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక అనుభవానికి పరాకాష్ట ;

శ్రీకృష్ణుడు ఒకానొక ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానానికి ప్రతీక.

ధనస్సును ధరించిన అర్జునుడు ప్రాపంచిక పురోభివృద్ధి కోసం

తన సర్వ శక్తి సామర్థ్యాలను వినియోగించడానికీమరి

బాహ్య శత్రువులనే కాకుండా అంతః శత్రువులను కూడా నిర్జించడానికీ

అనుక్షణం సిద్ధంగా వుండే ఒకానొక యోద్ధుడికీ

ఒకానొక ముముక్షువుకీ ప్రతీక.

ఈ ఇద్దరూఅంటే

సరియైన భౌతిక జీవన విధానంలో సరియైన ఆధ్యాత్మికతను మేళవించి,

మన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటే

సంపద, విజయం, ఐశ్వర్యం, పటిష్టమైన నీతి నియమాలు

ప్రతి ఒక్కరి జీవితంలో వెల్లివిరుస్తాయి.

శ్రీఅంటేఐశ్వర్యం ” “ ప్రాపంచిక సంపదలు

విజయంఅంటే సరియైన వివరణ  మోక్షం  ”, “  ఆత్మలబ్ధి ”.

ధ్రువానీతిఅంటేదృఢమైన ధర్మం ”, “ చక్కగా అనుష్టింపబడిన ధర్మం

భూతిఅంటేఆనందం ” “ ఇహ, పర లోకాలలో ఆనందం

వీటిని సాధించడానికి ధ్యానాన్ని

మన నిత్యజీవితంలో ఒక భాగంగా చేసుకుని

ఆధ్యాత్మిక జీవనం సాగిద్దాం! ధ్యాన సాధనచేద్దాం!! ధ్యానయోగులమవుదాం!!!

ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు?

క్షుద్రం హృదయ దౌర్భల్యం    … “ హృదయ దౌర్భల్యం తుచ్ఛమైనది

గతాసూన్ అగతాసూంశ్చ     … “ చనిపోయిన వారిని గురించి కానీ,

  నాను శోచంతి పండితాః  జీవించి వున్న వారి గురించి కానీ

పండితులుశోకించరు

అహమాత్మా గుడాకేశ      … ‘ నేనుఅనేదిఆత్మఅని తెలుసుకో,

అర్జునా !

న హన్యతే హన్యమానే శరీరే      … “ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు

యోగో భవతి దుఃఖహా      … “ ధ్యానయోగాభ్యాసం వల్లనే దుఃఖం

హరిస్తుంది

సమత్వం యోగ ఉచ్యతే      … “ అన్ని పరిస్థితులలోనూ సమంగా

        వుండడమే యోగం అనిపించుకుంటుంది

శ్రద్ధవాన్ లభతే జ్ఞానం    … “ శ్రద్ధ కలిగినవాడికే జ్ఞానం లభిస్తుంది

జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం    … “ ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కర్మలు

దగ్ధమవుతాయి

బుద్ధి నాశాత్ ప్రణశ్యతి      … “ బుద్ధి లేకపోవడమే ఆత్మ వినాశనం

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు     … “ కర్మలుచెయ్యడానికేఅధికారం

  కదాచన  వుంది కానీ వాటి ఫలితాలపైన

ఎప్పటికీలేదు

కర్మ జ్యాయో హ్యకర్మణః    … “ కర్మలు తక్కువ చెయ్యడం కంటే

కర్మలుఎక్కువచెయ్యడమేమంచిది

యోగః కర్మసు కౌశలమ్    … “ ధ్యానయోగం ద్వారానే కర్మల్లో

కౌశలంవస్తుంది

యోగస్థః కురు కర్మాణి    … “ యోగస్థితిలో వుండే కర్మలను

చెయ్యాలి

తస్మాత్ యోగీ భవార్జున    … “ కనుక ధ్యానయోగివి కా, అర్జునా ! ”

నిస్త్రైగుణ్యో భవార్జున    … “ త్రిగుణాలకు అతీతుడవు కా, అర్జునా !”

ఉద్ధరేదాత్మనాత్మానం    … “ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి

హతో వా ప్రాప్యసి స్వర్గం    … “ చనిపోయాక స్వర్గాన్ని పొందుతావు

యుద్ధస్య విగత జ్వరః    … “ ఎంతమాత్రం ఆవేశం లేకుండా యుద్ధం

   చెయ్యి

యథేచ్చసి తథాకురు    … “ నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి