ప్లేటో

 

క్రీ.పూ. 5వ శతాబ్దపు గ్రీకు దేశపు అతిముఖ్య తత్వవేత్త;

మహాజ్ఞాని సోక్రటీస్ యొక్క ముఖ్య శిష్యుడు.

ప్లేటో సూక్తులు కొన్ని:

“‘భగవంతుడు’ అంటే విశ్వం అంతా ఆవరించి వున్న వివేకం – బుద్ధి”

“ఆత్మకు అమృతత్వం వుంది”

“మనిషి లౌకిక వ్యవహారాలలో తలమునకలుగా మునిగిపోయి తన రెక్కలు కోల్పోయాడు; అంతకు ముందు అతను ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవతలతో సమంగా నివసిస్తూ ఉండేవాడు;

ఆ ప్రపంచంలో అంతా యదార్ధమూ – పవిత్రమూనూ”

“మనిషి ఇంకా రూపుకట్టుకోక ముందు కేవలం తేజోరూపంతో వ్యవహరిస్తూ ఉండేవాడు”

“సూర్యుడు అమృతమయుడైన సజీవమూర్తి”

“జీవయాత్ర ఉద్దేశ్యం ఇదే – దివ్యత్వాన్ని పొందడం;

జ్ఞానంతో సరితూగుతూ పవిత్రంగా వుండడం”

“ఆత్మ అన్నది శరీరం కన్నా ముందుగానే ఆవిర్భవించింది;

శరీరం ఉపాంగం; అనుషంగికం కూడా; ఆత్మకు అనుయాయిగా వుండడం తప్ప దానికి మరొక పని లేదు”

“అంతా పూర్వస్మృతే”

“మనిషి క్రమక్రమంగా పరిపూర్ణుడై, దివ్యజ్ఞాన జలధిలో ప్రయాణం చేయగలుగుతాడు.”

 

  • ప్లేటో వ్రాసిన “రిపబ్లిక్”, “డయలాగ్స్” అన్న పుస్తకాలు ప్రతి ముముక్షువు చదివితీరాల్సిందే. లేకపోతే బుద్ధివికాసం అన్నది అసంభవం.