పరిపూర్ణ జీవితం

 

 

మానవుడి జీవితం, పరిపూర్ణంగా వుండాలి.

మానవుడి జీవితం లో ఏవో కొన్ని అంశాలు వుంటే లాభం లేదు – అన్ని అంశాలూ ఉండాలి.

మానవుడు అన్ని విద్యలూ నేర్వాలి.

అన్నీ కళల్లోనూ ముందంజ వేయాలి. జీవితంలో వెయ్యేళ్ళ పంటగా వుండాలి.

మానవుడు తన కోసం తాను జీవించాలి. మానవుడు తన కుటుంబం కోసం జీవించాలి. మానవుడు తన గ్రామాన్నీ, పట్టణాన్నీ ఉద్ధరించాలి.

ఇదంతా తన్ను తాను భగవంతుడిగా తెలుసుకుంటే చాలా సులభం. ప్రతి మానవుడూ భగవంతుడే. అహం బ్రహ్మాస్మి కదా. ఆ స్పూర్తితో జీవితాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అందరి జీవితాల్నీ పరిపూర్ణం చేద్దాం.