భగవద్గీత 2-12

    “ త్వేవాహం జాతు నాసం త్వం నేమే జనాధిపాః |

     న చైవ భవిష్యామః సర్వే వయమతః పరమ్ || ”

 

పదచ్ఛేదం

తుఏవఅహంజాతుఆసంత్వంఇమేజనాధిపాఃఏవభవిష్యామఃసర్వేవయంఅతఃపరం

ప్రతిపదార్థం

అహం = నేను ; జాతు = ఒకప్పుడు ; , ఆసం = “ లేనుఅన్నది ; , తు, ఏవ = లేనే లేదు ; త్వం = నీవు ; (ఆసీః) = “ లేవుఅన్నది లేదు ; ఇమే = ; జనాధిపాః = రాజులు ; (ఆసన్) = “ లేరుఅన్నది లేదు ; = అంతేకాక ; అతః, పరం = ఇక మీదట ; వయం, సర్వే = మనం అందరం ; , భవిష్యామః = లేకపోవటం అన్నది ; , ఏవ = లేనే లేదు

తాత్పర్యం

నేను ఇదివరకు కాలంలోనూ లేనట్టు కాదు ; నువ్వు కూడా ఇదివరకు ఎన్నడూ లేనివాడివి కావు. అదేవిధంగా రాజులందరూ కూడా ఇంతకు ముందు కాలంలోనూ లేనివారు కారు. అంతేకాదు ; మనందరమూ భవిష్యత్తులో మళ్ళీ ఉండమనీ అనుకోవద్దు. ”

వివరణ

శరీరం ఏర్పడక ముందూ ఆత్మ ఉంది.

శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది.

శరీరానికి మూలం ఆత్మ.

అంతే కానీ ఆత్మకు మూలం శరీరం కానే కాదు.

ఆత్మ యొక్క తాత్కాలిక భౌతికపరమైన ఛాయ మాత్రమే శరీరం.

ఆత్మ అవినాశిదేహం సవినాశి.

ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది.

కనుకనేనేనూ, నీవూ, రాజులందరూ శాశ్వతమైన ఆత్మస్వరూపులం ;

మనం ఇంతకు ముందు ఉనికి, అస్తిత్వం లేని వాళ్ళమూ కాము;

అలాగే భవిష్యత్తులో ఉనికి, అస్తిత్వం ఉండని వాళ్ళమూ కాము.

ఎల్లప్పుడూ ఉనికి కలిగి ఉండే శాశ్వత ఆత్మలం మనం ” … అని

సమస్త జీవులూఆత్మవత్అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు శ్రీకృష్ణపరమాత్మ.