భగవద్గీత 2-13

        “ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా | .                   తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర ముహ్యతి || ”

 పదచ్ఛేదం

దేహినఃఅస్మిన్యథాదేహేకౌమారంయౌవనంజరాతథాదేహాంతరప్రాప్తిఃధీరఃతత్రముహ్యతి

ప్రతిపదార్థం

యథా = ఏవిధంగా అయితే ; దేహినః = జీవాత్మకు ; అస్మిన్, దేహే = దేహంలో ; కౌమారం = బాల్యం ; యౌవనం = యవ్వనం ; జరా = ముసలితనం ; తథా = అదేవిధంగా ; దేహాంతరప్రాప్తిః = మరొక దేహం ప్రాప్తిస్తుంది ; తత్ర = విషయంలో ; ధీరః = ధీరుడైనవాడు ; , ముహ్యతి = మోహానికి గురికాడు

తాత్పర్యం

దేహం వలన దేహాధారులకు బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైనవి కలగటం ఎంత సహజమో, మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజం ; ధీమంతుడు విషయంలో మోహితుడు కాడు. ”

వివరణ

ఒకానొక జీవాత్మ ఒకానొక పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తుంది.

పొత్తిళ్ళలోని పసిపాప నెమ్మదిగా నెలలు, సంవత్సరాలు గడచి

బాల్యదశను అనుభవిస్తుంది.

బాల్యం తర్వాత కౌమారం, తరువాత యవ్వనం ;

తరువాత ప్రౌఢదశ, వార్ధక్యం, చివరగా మరణం

విధంగా శరీరస్థితులు మారుతూ వుంటాయి.

ఒక దశలోని రూపం తరువాతి దశకు మార్పు చెందింది.

ఒక స్థితిలోని శరీరం వేరొక స్థితిలోకి చేరినప్పుడు అంతా మారిపోయింది

రూపం, శరీరం ఇలా మార్పులు తీసుకుంటుందేమిటి ? ”

అని ఆయాదశలలో ఎప్పుడూ మనం ఏడవటం లేదు !

ఎందుకంటే … 

అలా మార్పు చెందడం భౌతిక శరీరం యొక్క ధర్మం

అని మనకు ఖచ్చితంగా తెలుసు కనుక !

అయితేమరణానికి దుఃఖిస్తున్నాం ”…

ఎందుకంటే … “ ఆత్మధర్మంమనకు తెలియదు కనుక !

బాల్యంలో, యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలు

దశలు పూర్తి అయిన తర్వాతి దశలలో కూడా మనకు గుర్తుంటాయి.

అవి అనుభవించినప్పటి రూపం, శరీరం ఇప్పుడు లేకపోయినా

అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో మన మనస్సులో గుర్తుంటుంది.

అలాగే దేహంలో ఉన్నదేహి దేహం యొక్క మరణంతో

దేహాన్ని విడిచిపెట్టేసి పోయేటప్పుడు

ముఖ్యమైన అనుభవాలను వాసనల రూపంలో తనతో తీసుకుపోతుంది

అవేసంస్కారాలు ”.

బాల్యంలోని రూపం పోయి యవ్వనంలో ఇంకో రూపం వచ్చింది.

యవ్వనరూపం పోయి ముసలిరూపం వచ్చింది

అలాగే మరణం వల్ల దేహం పోయిన తరువాత 

దేహిఇంకో దేహం తీసుకుంటుంది.

జీవాత్మ దేహంలో పొందిన అనుభవాలకు సంబంధించిన 

పరిపూర్ణత సంతరించుకోవడానికి

సంస్కారాలను మోసుకుని, మరొక భౌతికదేహం పొందుతుంది.

కనుక దేహస్థితీ వుంది

దేహాంతర స్థితీ ఉంది

బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి దేహస్థితులు ఎంత సహజమో

మరో శరీరాన్ని పొందడమూ అంతే సహజం

విషయాన్ని గురించి ధీరుడు అయిన వాడు,

ఆత్మసత్యాన్ని అనుభవించిన వాడు

మోహాన్ని ఎప్పుడూ పొందడు !

ఇంకొక క్రొత్త దేహాన్ని పొందుతాడు కనుక

ఒకానొక జ్ఞాని చావుకు ఎప్పుడూ ఏడవడు

సదా తటస్థంగా వుంటాడు

అథవా చిరునవ్వుతో వుంటాడు !