భగవద్గీత 13-3

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |

క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ ||

 

పదచ్ఛేదం

క్షేత్రజ్ఞంఅపిమాంవిద్ధిసర్వక్షేత్రేషుభారతక్షేత్రక్షేత్రజ్ఞయోఃజ్ఞానంయత్తత్జ్ఞానంమతంమమ

ప్రతిపదార్థం

భారత = భరత వంశీకుడా ; సర్వక్షేత్రేషు = క్షేత్రాలన్నింటిలో ఉన్న ; క్షేత్రజ్ఞం అపి = క్షేత్రజ్ఞుని (జీవాత్మను) గూడ ; మాం = నేనే అని ; విద్ధి = తెలుసుకో ; = మరి ; క్షేత్రక్షేత్రజ్ఞయోః = క్షేత్ర, క్షేత్రజ్ఞుల యొక్క (ప్రకృతి పురుషుల యొక్క) ; యత్, జ్ఞానం = ఏ తత్త్వజ్ఞానము వుందో ; తత్ = అది ; జ్ఞానం = జ్ఞానం అని ; మమ, మతం = నా అభిప్రాయం

తాత్పర్యం

అర్జునా, అన్ని శరీరాలలోనూ వున్న క్షేతజ్ఞుడిని నేనే; క్షేత్ర, క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే వాస్తవమైన జ్ఞానం.”

వివరణ

క్షేత్రంఅంటే శరీరం.

క్షేత్రజ్ఞుడుఅంటే ఆత్మ.

దేహం క్షేత్రందేహి క్షేత్రజ్ఞుడు.

సమస్త ప్రాణులలో వున్న క్షేత్రజ్ఞుడు పరమాత్మయే.

ఆత్మ పరమాత్మలు అభేదాలు.

ఈ రకమైన జ్ఞానమే అసలయిన జ్ఞానం అని ప్రతి సాధకుడూ తెలుసుకోవాలి.

అన్ని శరీరాలలో వున్న క్షేత్రజ్ఞుడిని నేనేఅంటే

సమస్త ప్రాణుల శరీరాలలో వున్న జీవాత్మ ఏదైతే వుందో

అది పరమాత్మ కంటే వేరు కాదుఅని అర్థం.