భగవద్గీత 3-19

“ తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర |

అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ||

 

పదచ్ఛేదం

తస్మాత్ – అసక్తః – సతతం – కార్యం – కర్మ – సమాచర – అసక్తః – హి – ఆచరన్ – కర్మ – పరం – ఆప్నోతి – పూరుషః

ప్రతిపదార్ధం

తస్మాత్ = అందువల్ల ; సతతం = ఎల్లప్పుడూ ; అసక్తః = ఆసక్తిరహితుడవై ; కార్యం,కర్మ = కర్తవ్యకర్మను ; సమాచర = చక్కగా ఆచరించు ; హి = ఎందుకంటే; పూరుషః = మనుష్యుడు ; అసక్తః = ఆసక్తిరహితుడై ; కర్మ = కర్మ(ల)ను ; ఆచరన్ = ఆచరిస్తూ ; పరం = మోక్షాన్ని ; ఆప్నోతి = పొందుతాడు

తాత్పర్యం

“ అందువలన అర్జునా ! నువ్వు కూడా నిష్కాముడవై నిత్యం నీ కర్మల నాచరించు ; ఆపేక్షా రహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది. ”

వివరణ

చేయవలసింది … విషయాసక్తికి లోనుకాని, ఆసక్తి రహితమైన కర్మాచరణ !

కర్తవ్య నిర్వాహణ కోసం కర్మాచరణ … స్వార్థరహితమైన కర్మాచరణ !

జ్ఞాన సహితమైన కర్మాచరణ !

ప్రజారక్షణ కోసం … ధర్మ పరిరక్షణ కోసం కర్మాచరణ !

అటువంటి నిష్కామ కర్మాచరణ మోక్షానికి దారితీస్తుంది.