భగవద్గీత 7-16

చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోర్జున |ఆర్తో

జిజ్ఞాసురర్థార్థీజ్ఞానీచభరతర్షభ||

 

పదచ్ఛేదం

చతుర్విధాఃభజంతేమాంజనాఃసుకృతినఃఅర్జునఆర్తఃజిజ్ఞాసుఃఅర్థార్థీజ్ఞానీభరతర్షభ

ప్రతిపదార్థం

భరతర్షభ = భరత శ్రేష్ఠా ; సుకృతినః = శుభకర్మలు చేసేవారు ; అర్థార్థీ = సంపదలను కోరేవాడు ; ఆర్తః = ఆపదలో ఉన్నవాడు ; జిజ్ఞాసుః = ఐహిక విషయాలపై ఆసక్తిని వీడి, సర్వాత్మ జ్ఞానాన్ని పొందగోరే ; = మరి ; జ్ఞానీ = పరమాత్మ ప్రాప్తి పొందిన జ్ఞాని ; చతుర్విధాః = నాలుగు విధాలైన ; జనాః = జనులు ; మాం = “ నన్ను ” “ ఆత్మను ” ; భజంతే = సేవిస్తున్నారు

తాత్పర్యం

భరత శ్రేష్ఠా ! ఆపదల్లో పడినవాడు, జిజ్ఞాసువు, సంపదలను కోరేవాడు, జ్ఞానిఈ నాలుగు విధాల మనుష్యులేనన్ను ’ ‘ ఆత్మను సేవిస్తున్నారు. ”

వివరణ

కష్టాలలో ఉండి, ఆ కష్టాలను గట్టెక్కించమని ప్రార్ధించేవారుఆర్తులు ”.

శారీరక రోగాలు, మానసిక వేదనలు, ఆపదలు, శత్రుభయం

ఏదైనా కావచ్చుఅన్నీ కష్టాలే.

అర్థార్థిఅంటే సంపదను కోరుకునేవాడు

సంపద అంటే డబ్బే కానక్కరలేదు

కీర్తి ప్రతిష్ఠలూ, ఇహపర సుఖాలు కూడా కావచ్చు.

ఏమీ లేక కావాలని కోరుకోవచ్చు

లేక ఉన్నది చాలక ఇంకా కావాలని కోరుకోవచ్చు.

సత్యమేమిటో తెలుసుకోవాలని తపన పడేవాళ్ళుజిజ్ఞాసువులు ”.

వీళ్ళు స్వవిషయాల మీద ఆసక్తిని విడిచి,

రోగాలు, బాధలు వంటి వాటిని లక్ష్యపెట్టక పరమాత్మ తత్వం తెలుసుకోవాలని తపిస్తారు.

ఇకపోతేజ్ఞానులు ” … వీళ్ళుజ్ఞానం కలిగినవాళ్ళు ”.

ధ్యానం చేసి సర్వాత్మ ఒక్కటే సత్యమన్న జ్ఞానం పొందినవాళ్ళు.

వీళ్ళకు అసహజమైన అత్యాశలు ఏమీ ఉండవు.

ఒకానొక జ్ఞాని

సత్యం తెలిసినవాడుసర్వం తెలిసినవాడు.

ధ్యానయోగిగానే ఉన్నాడుఉంటాడు.

జిజ్ఞాసువు తత్వం తెలుసుకోవాలని తపిస్తున్నవాడు కాబట్టి

ధ్యానసాధన చేస్తే జ్ఞానిగా మారగలడు.

ఆర్తులు, అర్ధార్తులూ ప్రాపంచిక విషయ వ్యామోహాల్లో ఉన్నవారు.

ధ్యానం చెయ్యాలనిగానీ, జ్ఞానం పొందాలని గానీ ఇంకా కోరిక కలిగినవారు కారు.

కానీ వారి రకరకాల కోరికలు తీరాలన్నాఅనేకానేక కష్టాలు పోవాలన్నా

ధ్యానసాధన మరి చెయ్యవలసిందేజ్ఞానసముపార్జన చేయవలసిందే.