కోరికలను అణచవద్దు

 

కోరికలను
ఎప్పుడూ అణచరాదు

ధర్మయుక్తమయిన కోరికలను కానీ . .
అధర్మయుక్తమయిన కోరికలను కానీ,
కోరికలను ఎక్కువగా అణచడం వలన మనం ఆ యా వాటికి
సంబంధించిన పాఠాలను నేర్చుకోలేం.

కర్మలు చేయడం వల్లనే అనుభవం వస్తుంది
ఎలాంటి కర్మలనయినా సరే చేయాలే గానీ
“అకర్ముడి” గా మాత్రం ఉండరాదు

కోరికలే అభివృధ్ధికీ, పురోగతికీ మూలకారణాలు
కోరికలు లేకపోవడం వలన,
బలహీనమయిన కోరికల వలన, ఏదీ సాధ్యపడదు

కోరికల వల్లనే విద్యలను అభ్యసిస్తాం
కోరికల వల్లనే కళలను నేర్చుకుంటాం
కోరికల వల్లనే డబ్బును సంపాదిస్తాం
కోరికల వల్లనే సుఖాలను సంపాదించుకుంటాం

కోరికలు బలవత్తరంగా వుండాలి;
నిర్దిష్టంగా వుండాలిధర్మయుక్తంగా వుండాలి

కోరికలు లేకుండా మటుకు ఎప్పుడూ వుండరాదు.