కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు
- సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి.
- మనకు ఎన్నో దేహాలు ఉన్నాయి.
- మూలచైతన్యం నుంచి ‘వర్షం’ లా ఎప్పుడూ ఆత్మల సృష్టి జరుగుతూనే వుంది, వుంటుంది.
- పూర్ణాత్మలు అంటే పరిణితి చెందిన ఆత్మలు, కూడా తమలోంచి నూతన అంశాత్మలను సృష్టిస్తూ వుండడం జరుగుతూ వుంటుంది.
- మూలచైతన్య ఆత్మలు కానీ, పూర్ణాత్మల నుంచి వచ్చిన అంశాత్మలు కానీ, అన్నీ – రకరకాల అనుభవాలను జనన – మరణ చక్రంలో కానీ, దాని బయట కానీ – విధిగా సంపాదించుకోవాలి; శిశు ఆత్మలు అన్నీ విధిగా పరిణామ క్రమంలో పూర్ణపరిణితి చెందాల్సిందే.
- అన్ని అత్మలకూ ఎప్పుడూ పూర్తి స్వేచ్చ వుంటుంది.
- తమ తమ ఇచ్చా – స్వేచ్ఛ వల్ల రకరకాల కర్మలను చేస్తూ, చేస్తూ.. వాటి వాటి ఫలితాలను అనుభవిస్తూ, అనుభవిస్తూ .. ఎన్నో పాఠాలను నేర్చుకుంటూ నేర్చుకుంటూ .. ఉండడం అన్నది సదా జరుగుతూ, జరుగుతూ .. ఉంటుంది.
- .. .. .. ఇటువంటి సత్యాలు ఇంకా, ఇంకా ఎన్నో వున్నాయి; అన్నీ ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ తెలుసుకుంటూ వుండాలి.