కారణం – కార్యం

 

షడ్ దర్శనాలలో “వైశేషికం” ఒకటి “వైశేషికం” లో కారణ – కార్య సంబంధం గురించి కొన్ని సూత్రాలు :

  • “కారణభావాత్ కార్య భావః”

“కారణం వున్నప్పుడే కార్యం సంభవిస్తుంది”

  • “కారణ గుణ పూర్వకః కార్యగుణో దృష్టిః”

“కారణంలో ఎటువంటి గుణాలు వుంటాయో కార్యంలో కూడా అటువంటి గుణాలే వుంటాయి”

  • “కారణాభావత్ కార్యాభావః”

“కారణం లేకపోతే కార్యం ఉండదు”

  • “న తు కార్యాభావాత్ కారణా భావః”

“కార్యాభావం వలన కారణాభావం కలుగదు; కార్యం లేనంత మాత్రాన కారణం లేకుండా పోదు” (కుండ లేనంత మాత్రాన మట్టి లేకుండా ఉంటుందా ?)  (పండిత గోపదేవ్ ఆధారంగా) ప్రతీదీ కారణ – కార్యమే ప్రతి కార్యం వెనకాలా ఏదో కారణం ఉండే తీరుతుంది కారణం లేకుండా ఏ కార్యమూ జరుగదు ఒక్కోసారి కారణం కార్యరూపం ధరించకుండా ఉండగలదు కారణానికి మటుకు ‘కారణం’ వుండదు, కారణం ఎప్పుడూ స్వయంసిద్ధం . . .

  • “కారణ  కార్య సంబంధం” గురించి తెలుసుకోవడమే . .“కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవడం” అంటే