కర్మ సిద్ధాంతం
సిద్ధుల యొక్క అత్యంత అవగాహనే సిద్ధాంతం.
నిరంతరం సాధన యొక్క అంత్య స్థితే సిద్ధత్వం.
సృష్టిలో మొత్తానికి వున్నది కేవలం ఒక్కగానొక్క సిద్ధాంతమే.
ఆ ఒక్కగానొక్క సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం.
చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా.
చేసుకోని వాడికి చేసుకోనంత మహదేవా.
యద్భావతి తద్భవతి మహదేవా.
యద్భావతి తద్భావం మహదేవా.
మన భావనలే మన యదార్ధాలవుతాయి.
మన యదార్ధాల నుంచే మళ్ళీ మన భావనలు ఉదయిస్తాయి.