భగవద్గీత 2-47

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |

మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి || ”

 

పదచ్ఛేదం

కర్మణిఏవఅధికారఃతేమాఫలేషుకదాచనమాకర్మఫలహేతుఃభూఃమాతేసంగఃఅస్తుఅకర్మణి

ప్రతిపదార్థం

తే = నీకు ; కర్మణి ఏవ = కర్మాచరణలోనే ; అధికారః = అధికారం వుంది ; ఫలేషు = దాని ఫలితాల మీద ; కదాచన మా = ఎన్నడూ లేదు ; మా కర్మఫలహేతుః భూః = కర్మఫలానికి హేతువు కావద్దు ; తే = నీకు ; అకర్మణి = కర్మను మానడంలో ; సంగః = ఆసక్తి ; మా అస్తు = ఉండకూడదు

తాత్పర్యం

నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, కర్మఫలానికి అధికారివి కాదు ; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు ; అలాగని కర్మలు చేయడం మానకు. ”

వివరణ

కర్మలను చేయడానికే మనకు హక్కు ఉంది !

కర్మలను సదా అప్రమత్తతతో చేస్తూ ఉండాలి  !

ఎప్పుడూకర్మిష్ఠిగానే ఉండాలి !

అకర్మణ్యత్వంఅన్నది ఎప్పుడూ వుండకూడదు !

నెల మొత్తం పూర్తిగా పనిచేసిన తరువాతనే జీతం వస్తుంది

ఫలితాన్ని తరువాతి నెలలోనే అనుభవించ గలుగుతాం.

వర్తమానంలో దుక్కిదున్ని, విత్తుచల్లి, చేనుకు సంరక్షణ చేస్తేనే

భవిష్యత్తులో పంట చేతికి వస్తుంది.

విత్తనాలు చల్లగానే పంట పండి ధాన్యం చేతికి రాదు !

అలాంటివే మనం పొందే కర్మఫలాలు కూడా !

వర్తమానంలోని సుఖసంతోషాలు గత జన్మల మంచి కర్మల ఫలితాలు

కష్టాలు, నష్టాలు చెడు కర్మల ఫలితాలు.

అలాగే వర్తమానంలోని కర్మఫలాలను భవిష్యత్తులో అనుభవిస్తాం.

వర్తమాన జన్మకు సంబంధించిన పరిమితమైన జ్ఞానంతో

ఇప్పుడు అనుభవిస్తున్న కర్మఫలాలు

మన యొక్క అనేకానేక గత జన్మలలోని జన్మకు సంబంధించినవి

కర్మఫలం అనేది అవగాహనకు రాదుమనం నిర్దేశించలేము కూడా !

అందుకే చేస్తున్న కర్మలకు ఎప్పుడూలెక్కలుకట్టకూడదు !

లెక్కలుకట్టడానికి మన దగ్గర సరి అయినవిషయజ్ఞానం

ఏమీ లేదు ! లెక్కలను, ఫలితాలనూ పూర్ణ సృష్టికే వదిలేయాలి !

సృష్టికి మాత్రమే తెలుసుసరి అయిన లెక్కలుకట్టడం !

జన్మజన్మల లెక్కల ప్రకారం రావల్సింది అంతా వచ్చే తీరుతుంది !

జన్మజన్మల లెక్కల ప్రకారం పోవల్సిందంతా పోయే తీరుతుంది !

కర్మఫలాసక్తిఉంటే

ఫలసిద్ధి ’, ‘ అసిద్ధు పట్ల రాగద్వేషాలను కలిగించి

కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నిర్వహించబడదు.

కర్మలు చెయ్యడం మాని అకర్ముడిగా మారిపోతే

భవిష్యత్తుకు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్థం చేస్తే

భవిష్యత్తును సంపూర్ణంగా నష్టపోతాం.

కనుక మనం కర్మలను చేస్తూనే ఉండాలి.

అకర్ములుగా ఎన్నటికీ కారాదు.

దేనినైతే మనంధర్మంఅనుకుంటున్నామో ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి.

రకమైన ధర్మ కర్మలు చేస్తూనే ఉండాలి.