కన్ప్యూషియస్
కన్ప్యూషియస్
6 వ శతాబ్దం B.C. నాటి
చైనా దేశపు మహాజ్ఞాని
“మీ దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలి అంటే, ముందుగా రాష్ట్రలను చక్కబెట్టాలి;
రాష్ట్రాలను చక్కబెట్టాలి అంటే ముందుగా కుటుంబాలను కుదుటపరచాలి;
కుటుంబాలు కుదుటపడాలి అంటే ముందుగా ‘వ్యక్తిగత జీవితం’ సరిదిద్దబడాలి;
వ్యక్తిగత జీవితం సరిదిద్దబడాలి అంటే ముందుగా వ్యక్తి తన ‘బుద్ధిమాంద్యం’ పోగొట్టుకోవాలి;
బుద్ధిమాంద్యం పోవాలి అంటే ముందుగా ‘శ్రద్ధ’, ‘దీక్ష’ అన్నవి అవసరం;
శ్రద్ధ, దీక్ష అన్నవి కుదరాలి అంటే ‘జ్ఞాన విస్తరణ’ అవసరం;
జ్ఞాన విస్తరణ జరగాలి అంటే, ‘అన్నింటిని పరిశోధించడం’ అన్న ప్రక్రియ తప్పనిసరి” – అన్నాడాయన.
- “వస్తుతత్వ పరిశోధన ద్వారానే జ్ఞాన విస్తరణ జరుగుతుంది”
- “జ్ఞాన విస్తరణ ద్వారానే శ్రద్ధ, దీక్ష అన్నవి అకుంఠితమవుతాయి”
- “శ్రద్ధ, దీక్ష అన్నవి అకుంఠితమవ్వడం ద్వారానే బుద్ధిమాంద్యం పోతుంది”
- “బుద్ధిమాంద్యం పోవడం ద్వారానే వ్యక్తిగత జీవితం సరిదిద్దబడుతుంది”
- “వ్యక్తిగత జీవితాలు సరిదిద్దబడడం ద్వారానే కుటుంబాలు కుదుటబడతాయి”
- “కుటుంబాలు కుదుటపడడం ద్వారానే రాష్ట్రాలు చక్కబడతాయి”
- “రాష్ట్రాలు చక్కబడడం ద్వారానే దేశం గొప్పగా అవుతుంది”
- “అప్పుడే మీ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటగలరు”
- ఈ ఎనిమిది అంశాల సారాన్నే“ది గ్రేట్ లెర్నింగ్” అంటే “మహాజ్ఞానం” అని చైనాలో అంటారు.