ఏ న్యూనమూ లేదు
“అన్నము లారగించిననూ,
అంబర భూషణాది దాల్చిననూ,
కన్య తోడి కూడిననూ
కన్న తనూజ ను ముద్దు చేసిననూ,
సకల బంధునాప్తులను దాపు చేర్చి నటించిననూ
ఏ న్యూనమూ లేదు బ్రహ్మవేత్తలకిలన్”
– శ్రీ సదానందయోగి
నా గురువు
శ్రీ సదానంద యోగి . . కర్నూలు స్వామీజీ . .
నూటికి నూరు పైసలు అచ్చమైన మహా బ్రహ్మర్షి.
1981 జనవరి 1 నుంచి ఆయన పరిచయ భాగ్యం వుండింది నాకు;
1983 మే 22 న తన శరీరాన్ని ఆయన స్వచ్ఛందంగా వదలిపెట్టారు,
ఆయన వయస్సు అప్పటికే సుమారు ‘160’ సంవత్సరాలు
ఆయన గురించి చెప్పాలి అంటే ఎన్నో .. ఎన్నెన్నో . .
* బ్రహ్మవేత్తల నిర్వాణానికి సంసారం అడ్డుకాదు;
“సంసారం” , “నిర్వాణం” అనే రెండు గుర్రాల మీద
ఒకేసారి స్వారీ చెయ్యాలి – అన్నదే అత్యంత గొప్ప సాహసం