ఏడు శరీరాలు
మనిషి అన్నాక వున్నది ఒక్క శరీరమే కదా ? అవును/కాదు. చూడటానికి ఒక్కటే కానీ అంతర్లీనంగా ఆరు శరీరాలున్నాయి.
1. Physical Body | అన్నమయకోశం .. స్థూలశరీరం |
2. Etheric Body | ప్రాణమయకోశమ్ .. కాంతిమయ శరీరం |
3. Astral Body | భావనమయ శరీరం, లేదా మనోమయకోశం .. సూక్ష్మశరీరం |
4. Mental Body or Causal Body | విజ్ఞానమయకోశం .. కారణ శరీరం |
5. Spiritual Body | ఆనందమయకోశం |
6. Cosmic Body | విశ్వమయకోశం .. మహాకారణశరీరం |
7. Nirvanic Body | నిర్వాణమయకోశం |
మానవుడి చైతన్యం Consciousness భౌతిక శరీరంలో కేంద్రీకృతమై ఉన్నప్పుడు, అంటే జాగ్రదవస్థలో ఉన్నప్పుడు, ఈ స్థూల విశ్వంలో విహరిస్తూ కర్మలు చేస్తూ వుంటాడు. స్థూల శరీరానికి మరణం ఆసన్నమైనప్పుడు సూక్ష్మశరీరం విడుదల అవుతుంది. ” కాంతిమయశరీరం ” అన్నది రెండు మూడు రోజుల వరకు భౌతిక కాయన్నే అంటిపెట్టుకుని (కాయం వుంటే) తరువాత క్రమక్రమంగా కరిగిపోతూ వుంటుంది. సూక్ష్మశరీరంతో సూక్ష్మలోకాలలో తను ఆ జన్మలో చేసిన కర్మలను చూసుకుని పశ్ఛాత్తాపపడి, ఆ సూక్ష్మశరీరాన్ని కూడా విసర్జించి తన స్వంత బింబాన్ని సూత్రాత్మను, అంటే కారణ దేహాన్ని చేరుతాడు. నిజానికి ఆ బింబం ఎప్పటికీ కారణ లోకాన్ని విడవదు. అందులో నుంచి ఉద్భవించిన ఓ ప్రతిబింబమే భూలోకానికి వచ్చి కర్మలు చేసి, శరీరం వదిలి, సూక్ష్మలోకాలలో కర్మ ఫలాలను అనుభవించి తిరిగి తన ” మూలబింబం ” లో తాను ” లీనం ” అవుతుంది. ఈ ” పర్యటన ” మొత్తం యొక్క ఫలం ” జ్ఞానం “. ఈ విధంగా ప్రతి జన్మలో ఒకింత జ్ఞానాన్ని సంతరించుకుంటే క్రమంగా ఒక్కొక్క లోకాన్నీ దాటుతు, పూర్ణ ఆత్మజ్ఞానం కలగటంతో కారణలోకాలని వదిలి మహాకారణ లోకలలోకి ప్రవేశిస్తుంది. ” బింబాత్మ ” కారణలోకాలలో ఉన్నంతవరకూ జన్మ తప్పదు. ఆ తరువాత కావాలనుకుంటే వస్తుంది. లేకపోతే లేదు. తనను తాను సంపూర్ణంగా తెలుసుకోవడమే ” జన్మరాహిత్య పదవిని, మోక్షాన్ని పొందటం “. అంటే దీనితో అంశాత్మ పూర్ణాత్మతో సాలోక్యాన్నీ, సామీప్యాన్నీ, సారూప్యాన్నీ, చిట్టచివరిగా సాయుజ్యాన్నీ చిరకాలంలో పొందుతుంది. సాయుజ్యాన్ని, ఐక్యతను సాధించినప్పుడు తానూ పరమాత్మగా, తారగా, చిరకాలంలో అచలంగా, స్వయంభూగా, ఆదిత్యుడిగా, సర్వలోక జ్ఞానప్రదాయిగా, శక్తిప్రదాయిగా నిలిచిపోతుంది. ధ్యానంలో ఒక్కోసారి ఒక్కో లోకానికి వెళ్తుంటాం. ఆయా లోక పరిధిని బట్టి, ఆయా శరీరాలను ఆటోమాటిక్‌గా తీసుకెళ్తుంది. ఉదా: భూమి నుంచి రకెట్ వదిలినప్పుడు అసలైన పాయింటును చేరే లోపల, దానికి అంతవరకూ ఇంధనంగా ఉపయోగించబడ్డవి అక్కడ వదిలిపెట్టబడుతూ వుంటాయి. ఆ విధంగానే లోకాన్ని బట్టి శరీర మార్పు వుంటూ వుంటుంది. మన జీవితం వున్నది –
-
అన్నమయకోశం ద్వారా . . . విషయానందం కోసం.
-
మనోమయకోశం ద్వారా . . . భజనానందం కోసం
-
విజ్ఞానమయకోశం ద్వారా . . . జ్ఞానందం కోసం
-
ఆనందమయకోశం ద్వారా . . . బ్రహ్మానందం కోసం
ఇటువంటి ఆనందాలు రోజూ పొందాలంటే రోజూ కనీసం,
-
ఒక గంట . . . . ధ్యానం
-
ఒక గంట . . . . స్వాధ్యాయం
-
ఒక గంట . . . . సజ్జన సాంగత్యం చేసి తీరాలి.
మిగతా సమయాల్లో సంతోషంగా వుంటూ జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.