ఏకతా ధ్యానం
“ఏకత” అంటే ?
“మనతో మనకు ఏకత”
“భూమిమీద ప్రజలందరితో ఏకత”
“సృష్టిలోని సకలప్రాణికోటితో ఏకత”
21 డిసెంబర్, 2012 కల్లా భూమ్మీద సంపూర్ణ ఏకత్వాన్ని సాధించే ఉద్దేశ్యంతో…
ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు
ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు అందరూ కూడా విధిగా సామూహిక ఏకతా ధ్యానం చేయాలి.
దగ్గరలోని పిరమిడ్ ధ్యానకేంద్రంలో కానీ,
దగ్గరలోని పిరమిడ్ కేర్ సెంటర్‌లో కానీ
లేదా స్వగృహాల్లో కానీ
పిరమిడ్ మాస్టర్లందరూ విధిగా
ఏకసమయంలో ఒక గంటసేపు ధ్యానస్థులు కావాలి
దీని పేరు “ఏకతా ధ్యానం”
ఈ బృహత్ పంచవర్ష ప్రణాళిక 2008 జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమయి,
21 డిసెంబరు 2012 వరకు అఖండంగా జరుగుతుంది.
పిరమిడ్ మాస్టర్లందరి సమిష్టి సంకల్పబలం ద్వారా
“ధ్యాన జగత్ – 2012“
దిగ్విజయంగా సకాలంలో నిర్మించబడాలన్నది బ్రహ్మర్షి పత్రీజీ బృహత్ సంకల్పం
సమిష్టి సంకల్పం + సమిష్ఠి శక్తి = సమిష్టి కళ్యాణం