ఎన్లైటెన్డ్ మాస్టర్ అంటే ఎవరు?
“దివ్యజ్ఞాన ప్రకశం గురించీ, ఆత్మతత్వాన్ని గురించీ సరియైన అవగాహన చేసుకుని దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టినవాడే.”
“సమాజం నుంచి సంక్రమించిన మానవ జీవితంలో ‘ఎంత ఎదగవచ్చు’ అన్న అవగాహన కలిగినవాడే.”
“మూర్ఖ సాంప్రదయాలనూ, గ్రుడ్డి నమ్మకాలనూ తన జీవితంలోంచి సమూలంగా పెకిలించి వేసినవాడే.”
“సరియైన సుశాస్త్రీయ్ దృక్పధాలను అలవరుచు కున్నవాడే.”
“ఎల్లప్పుడూ తక్షణకర్తవ్యంలో తన బుద్ధినీ, శక్తినీ వినియోగించుకునేవాడే.”
” ‘అన్ని రకాల జ్ఞానాలకూ మూలం ధ్యానం’ అని తెలుసుకున్నవాడే.”
” ‘ సంసారమే నిర్వాణం’ అన్న అవగాహన కలిగినవాడే.”
“సమయాన్ని క్షణమాత్రం కూడా వృధా చేయనివాడే.”
“సృష్టిలోని కార్యకారణ్ సంబంధం గురించి సమగ్రంగా తెలుసుకుని దేనికీ ఆశ్చర్యపోనివాడే.”
“ఏ విషయం గురించైనా త్వరపడి తొందర నిర్ణయం తీసుకోనివాడే.”
“ప్రతి క్షణమూ పరిశ్రమిస్తూ అన్ని రకాల కళలలో ప్రావీణ్యతకు ప్రయత్నించేవాడే.”
“విశాలమైన మనోభావాలు కలిగి పరిణితి చెందిన సభ్య సమాజకుడే, సభ్య సమాజం యొక్క సకల సుగుణాలనూ, సురీతులనూ విపులంగా అవగాహన కలిగినవాడే.”
” ‘నాకే అన్నీ తెలుసు’ అని అనుకోకుండా ‘ నాకూ కొంత తెలుసు’ అన్న అవగాహన కలిగినవాడే.”
“తెలుసుకోవడానికి ‘అవధి’ అంటూ ఎప్పుడూ లేదని తెలుసుకున్నవాడే.”
“ఏ ఆధ్యాత్మిక విషయన్నైనా సహేతుకుంగా, సందర్భానుసారంగా మాట్లాడగలిగేవాడే.”
“ఉన్నది ఉన్నట్లు – లేనిది లేనట్లుగా మాట్లాడుతూ జీవితంలో దేనికి ఏడవనివాడే.”
“ఆధ్యాత్మిక పనులలో ఏకాగ్రత, దీక్ష, పట్టుదల అనేవి సహజ స్వభావం అయినవాడే.”
“నూతనం, నిస్సంకోచం, నిర్భయం, నిత్యానందమయం అయిన ఆత్మ జీవితశైలిని అలవరచుకున్నవాడే.”
” ‘ ఈ సృష్టి అంతా నేనే ‘ – ‘నేనే ఈ సృష్టి అంతా’ అన్న అవగాహన కలిగినవాడే.”
“తన దగ్గర ఏది వుంటే అది అందరికీ పంచుతూ తనకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారికి సదా చేయూతనిచ్చేవాడే.”
“చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ఆ యా తప్పులు మళ్ళీ మళ్ళీ చేయనిఅవాడే.”
“చక్కటి మానసిక మౌన స్థితిలో నిర్విరామంగా ఉంటూ ‘ నా వాస్తవానికి నేను సృష్టికర్తను’ అన్న అవగాహనతో క్షణ క్షణం జీవించేవాడే.”
“ప్రపంచంలో తిరుగుతున్నా ప్రపంచానికి అంటకుండా ఎలాంటి పరిస్థితులలోనూ భయాందోళనలకు ఏ మాత్రం తావియ్యనివాడే.”
“గతించినదానితో ముడిపడకుండా సదా వర్తమానంలో ఆనందంగా జీవించేవాడే.”
“సహజమైన భావోద్రేకాలను ఏ మాత్రం అణగ ద్రొక్కకుండా , ప్రతీదీ తెలుసుకోవాలన్న తపన కలిగినవాడే.”
” ‘తెలుసుకున్నది రవ్వంత, తెలుసుకోవాల్సింది కొండంత ‘ అన్న సదవగాహనతో జీవించినవాడే.”
“జీవితంలో సమస్యలను అన్నింటినీ ‘ సవాళ్ళు’గా గ్రహించే ధీశక్తి కలిగినవాడే.’
“ఎన్లైటెన్మెంట్ యొక్క వివిధ రీతులను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ వాటిని వీలైనంతగా ఆచరణలో తీసుకొచ్చేవాడే.