భగవద్గీత 15-10

ఉత్ర్కామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్ |

విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః ||

 

పదచ్ఛేదం

ఉత్ర్కామంతంస్థితంవాఅపిభుంజానంవాగుణాన్వితంవిమూఢాఃఅనుపశ్యంతిపశ్యంతిజ్ఞానచక్షుషః

ప్రతిపదార్థం

ఉత్ర్కామంతం = జీవుడు శరీరాన్ని వదలుతున్నప్పుడు ; వా = లేక ; స్థితమ్ = శరీరంలో వున్నప్పుడు ; వా = లేక ; భుంజానం = భోగాలను అనుభవిస్తున్నప్పుడు ; గుణాన్వితం, అపి = అలాగే త్రిగుణాలతో కూడి వున్నప్పుడు ; విమూఢాః = అజ్ఞానులు ; , అనుపశ్యంతి = తెలుసుకోలేరు ; జ్ఞానచక్షుషః = కేవలం జ్ఞానులే తమ జ్ఞాన నేత్రాల ద్వారా ; పశ్యంతి = సత్య స్వరూపాన్ని తెలుసుకుంటారు

తాత్పర్యం

జీవాత్మ దేహంలో గుణాలను కలిగి వున్నప్పుడు, విషయాలను అనుభవించేటప్పుడూ, శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడూ జ్ఞానచక్షువు కలిగిన జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు. అంతేకాని అజ్ఞానులు ఈ విషయాలను తెలుసుకోలేరు. ”

వివరణ

భౌతిక శరీరంలో నివశిస్తున్న జీవాత్మ,

తన పూర్వజన్మల సంస్కారాలకు అనుగుణంగా గుణాలను కలిగి వుంటుంది.

బాహ్య ఇంద్రియాలతో గ్రహించిన విషయాలను

తన గుణాలకు అనుగుణంగా అనుభవిస్తూ ఉంటుంది.

మరణం ఆసన్నమైనప్పుడు, తనలోని సంస్కారాలనువాసనలను తీసుకుని

స్థూలశరీరాన్ని విడిచి, సూక్ష్మశరీరంగా వెళ్ళిపోతుంది. నిష్క్రమిస్తుంది.

ఇటువంటి నిగూఢ సత్యాలను

జీవాత్మ ఈ శరీరంలో గుణాలతో కలసివున్నప్పుడు గానీ

విషయాలను అనుభవించేటప్పుడు గానీ

చివరికి శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు గానీ

ఆయా యదార్థాలనుఅజ్ఞానులు ఎంతమాత్రం తెలుసుకోలేరు.

కేవలంజ్ఞానం అనే నేత్రంకలిగిన జ్ఞానులు మాత్రమే

జీవాత్మ స్థితులను యదార్థంగా, వున్నది వున్నట్లుగా గ్రహించగలుగుతారు.

జ్ఞాన నేత్రం, ” “ దివ్య చక్షువుఅన్నది

కేవలం ధ్యానసాధన ద్వారానే సిద్ధిస్తుంది.