భగవద్గీత 2-28
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా || ”

 

 

పదచ్ఛేదం

అవ్యక్తాదీనిభూతానివ్యక్తమధ్యానిభారతఅవ్యక్తనిధనానిఏవతత్రకాపరిదేవనా

ప్రతిపదార్థం

భారత = అర్జునా ; భూతాని = ప్రాణులు ; అవ్యక్తాదీని = పుట్టుకకు ముందు కనపడవు ; అవ్యక్తనిధనాని, ఏవ = మరణించిన తరువాత కూడా అవ్యక్తాలే ; వ్యక్తమధ్యాని = జనన మరణాల మధ్యకాలంలో మాత్రమే కనిపిస్తాయి ; తత్ర = ఇలాంటి స్థితిలో ; కా, పరిదేవనా = శోకించడం ఎందుకు?

తాత్పర్యం

 “ అర్జునా ! ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనపడవు ; మరణం తర్వాత కూడా కనపడవు ; చావు పుట్టుకల మధ్యకాలంలో మాత్రమే కనిపిస్తాయి ; అటువంటప్పుడు శోకించడం ఎందుకు ? ”

వివరణ

ఒకడు నిద్రించినప్పుడు ఒక కల కంటాడు

కలలో అతనికి భార్యా, పిల్లలు, మేడలు, ఐశ్వర్యంఅన్నీ ఉంటాయి.

నిద్ర లేచాక చూస్తే భార్యా, పిల్లలు, మేడలు, ఐశ్వర్యంఇవేవీ ఉండవు.

నిద్ర పోకముందు అవేవీ లేవునిద్రలేచాక కూడా లేవు.

కానీ మధ్యలో, స్వప్నంలోస్వప్న జగత్తులో అవన్నీ ఉన్నాయి.

వాస్తవంగా మాత్రం లేవు

ఆదిలోనూ లేకఅంతంలోనూ లేకమధ్యలో మాత్రం ఉంటే

అది మిథ్యావస్తువే ! మిథ్యా జగత్తు భ్రాంతి మాత్రమే !

ఏడిస్తేశోకిస్తే స్వప్నంలోని భార్యా, పిల్లలూ, ఐశ్వర్యంఅవన్నీ రావు.

అటువంటి వాటికోసం దుఃఖించడం ఎందుకు ?

అలాగే పుట్టుక, చావుల మధ్యలో మాత్రమే వ్యక్తం అవుతాయి ప్రాణులు.

ఆత్మ అనేది పుట్టుక ముందు ఉంది కానీ

శరీరం లేదు కాబట్టి అవ్యక్తంగా ఉంది.

పుట్టిన తర్వాత నుంచీ, అంటే మధ్యలో

శరీరధారి అయ్యింది కాబట్టి కనిపిస్తుంది.

మరణం తర్వాత శరీరం పోతుంది కాబట్టి మళ్ళీ కనిపించదు.

కనుక ఆత్మ నిత్యమైనదిశరీరం అనిత్యమైనది.

పుట్టుకకు ముందూ లేనిమరణం తర్వాతా లేని

చావు పుట్టుకల మధ్యలో మాత్రమే ఉండే

అశాశ్వతమైన శరీరం కోసం ఏడవడందుఃఖించడం అవివేకం !